జనసేనలోకి ఉపాసన..ఎంపీగా పోటీ!

Upasana To join Janasena ..!

తనను టార్గెట్ చేసుకుని అనవసరమైన వివాదాలు రేపుతూ వయసులో పెద్దవారైన తన తల్లిని చెప్పలేని రీతిలో దూషించారని మీడియాపై, ఏపీ ప్రభుత్వంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకపడుతున్న సంగతి తెలిసిందే. పవన్‌కు సినీ,రాజకీయాలకు అతీతంగా పలువురు మద్దతు ప్రకటించారు. ఇక మెగాక్యాంప్‌లోని హీరోలంతా బాబాయ్ పవన్‌ వెంటే నిలిచారు. ఈ నేపథ్యంలో టీ టౌన్‌లో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

తొందర్లోనే తమను టార్గెట్ చేసిన వారు దూల తీరుస్తాడని మెగా బ్రదర్ నాగబాబు ఘాటూగా స్పందించిన నేపథ్యంలో మెగా క్యాంప్‌ మొత్తం జనసేనలోకి చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన త్వరలోనే పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చారిటీ కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ పొందిన ఉపాసన జనసేన నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. జనసేన నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నారని….అయితే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై మాత్రం క్లారిటీ వెలువడలేదు.

బిలియనిర్లు రాజకీయాల్లోకి రావడం ఎంపీలుగా పోటీచేయడం సర్వసాధారణమైనప్పటికి ఉపాసన పాలిటిక్స్‌లోకి వస్తారన్న వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి ప్రజారాజ్యం స్ధాపించినప్పుడు మెగా కుటుంబం నుంచి చిరు తప్ప ఎవరు పోటీచేయలేదు. కానీ తాజాగా పవన్ స్ధాపించిన జనసేనలో మెగా హీరోలు చేరుతారని ప్రచారం జరుగుతుండగానే ఉపాసన ఎంపీగా బరిలోకి దిగుతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఉపాసన పొలిటికల్ ఎంట్రీ,జనసేన నుంచి ఎంపీగా పోటీచేస్తారన్న వార్తలతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో
తెలియదు కానీ ఒకవేళ ఉపాసన నిజంగానే జనసేనలో చేరితే రాజకీయాల్లో పెను మార్పులు రావడం మాత్రం ఖాయమనే చెప్పుకోవాలి.