రాజకీయాల్లోకి ఉపేంద్ర… కొత్త పార్టీ ఏర్పాటు

Upendra Announes new political party

కన్నడ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కొంతకాలంగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై ఉహాగానాలు జోరందకున్నాయి. సొంతపార్టీ పెడతారని కొంతమంది వాదిస్తే మరికొంత మంది బీజేపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతు ఉపేంద్ర సొంత రాజకీయ పార్టీ వైపే మొగ్గుచూపాడు.

ఈ మేరకు రాజకీయ పార్టీని స్థాపిస్తానంటూ 13 నిమిషాల ఆడియో ని నటుడు ఉపేంద్ర విడుదల చేశారు. ఎవరి దగ్గర పార్టీ ఫండ్ తీసుకోనని, రాత పరీక్షలు పెట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలని, బ్యానర్లు, పోస్టర్లు, ర్యాలీలు, ట్రాఫిక్ జాంలు లేకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని ఉపేంద్ర తెలిపారు.రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని తెలిపారు. ఇందుకోసం ప్రజల సలహాలు స్వీకరిస్తానని ఉపేంద్ర చెప్పారు.

Upendra Announes new political party
ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు డబ్బు, కులంతో ముడిపడి ఉన్నాయని.. ఈ పరిస్థితి మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు నిజాయతీగా పని చేయాలని, ప్రజలు పన్ను రూపంలో చెల్లిస్తోన్న ధనాన్ని వృథా చేయొద్దని సూచించారు. స్వచ్ఛభారత్ తరహాలో మార్పు అనేది క్షేత్ర స్థాయిలో రావాలి. స్వచ్ఛ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఉపేంద్ర నిర్ణయంతో కర్ణాటకలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరి నిమిషం వరకు ఉపేంద్రను బీజేపీలోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఆయన సొంత పార్టీ వైపే మొగ్గుచూపారు.
తమిళనాడులో రజనీ  రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు జోరందుకున్న నేపథ్యంలో ఉపేంద్ర పొలిటికల్ ఎంట్రీ…కొత్త పార్టీ ఏర్పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.