చివరి పరుగులో కుప్పకూలిన బోల్ట్‌

Usain Bolt's Final Race Ends in a Pain
Usain Bolt's Final Race Ends in a Pain

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఫైనల్ కౌంట్‌డౌన్ అయిపోయింది. కెరీర్‌లో ఇదే తనకు చివరి ఈవెంట్ అని ప్రకటించిన బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆఖరి రేసులో అభిమానుల్ని నిరాశపరిచాడు. వ్యక్తిగత రేసులో స్వర్ణం చేజార్చుకొని కాంస్యానికి పరిమితమైన బోల్ట్.. రిలే ఈవెంట్‌లో మాత్రం నిరాశపరుచను అని రేసుకు ముందురోజు చెప్పాడు. అయితే నిన్న రాత్రి జరిగిన 4×100 మీటర్ల రిలే ఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. కొద్ది దూరం పరుగెత్తిన వెంటనే బోల్ట్ తొడ కండరాలు పట్టేయడం, మోకాలి నొప్పి కారణంగా ట్రాక్ పైనే కుప్పకూలిపోయాడు. దీంతో, అంతర్జాతీయ కెరీర్ ను స్వర్ణపతకంతో ముగించాలనుకున్న బోల్ట్ కలలు కల్లలయ్యాయి.

bolt

అంతకుముందు బోల్ట్ సారథ్యంలోని జమైకా జట్టు 4X100 మీటర్ల రిలేలో హీట్స్‌ను విజయవంతంగా అధిగమించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో హీట్స్ నుంచి పోటీపడ్డ టైక్వాండో ట్రేసీ, జులియన్ ఫోర్టె, మైకేల్ క్యాంప్‌బెల్, బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం 37.95 సెకన్లలో రేసు ముగించి ఈ సీజన్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేసింది. టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్ బెల్, ఉసేన్ బోల్ట్ లతో కూడిన జమైకా బృందం ఈ ఫైనల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ఎటువంటి పతకమూ సాధించకుండానే బోల్ట్ కెరీర్ ను ముగించినట్టయింది. కాగా, 4×100 మీటర్ల రిలేలో వరుసగా ఐదో పతకాన్ని సాధించేందుకు బోల్ట్ చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు.