అరారియాలో ఆర్జేడీ గెలుపు..

Uttar Pradesh's Lok Sabha by-election results

ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒటమిపాలైంది. మూడుదశబ్దాలుగా ఓటమి ఎరుగని బీజేపీ మట్టికరిచింది. గోరఖ్‌పూర్‌ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ గెలుపొందింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభ స్థానాన్ని.. ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ 21,961 భారీ మెజారిటీతో బీజేపీపై విజయం సాధించారు. డిప్యూటీ సీఎం అయిన మౌర్య నియోజక వర్గం ఫుల్పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నాగేంద్ర సింగ్ పటేల్ 59,613 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

Uttar Pradesh's Lok Sabha by-election results

ఈ ఉప ఎన్నికల్లో అరారియా లోక్‌సభ నియోజవర్గాన్ని ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 57,358 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఆర్జేడీ ఎంపీ మోహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, జేడీయూ నుంచి ఆర్జేడీలోకి చేరిన తస్లిముద్దీన్ తనయుడు అలాంకు అక్కడ ఆర్జేడీ సీటిచ్చింది. అరారియాలో ఆర్జేడీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు.