రంగాని చంపించింది ఎన్టీఆరే…?

Vangaveeti Narendra sensational comments on Ntr..!

వంగవీటి రంగా హత్య జరిగి ఇన్నిరోజులు ఆయన మర్డర్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో రంగా సోదరుడు నారాయణ రావు కుమారుడు వంగవీటి నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. అధికార దాహం కోసమే ఎన్టీఆర్ కుల రాజకీయాలకు తెరలేపాడని….వంగవీటి కుటుంబాన్ని లేకుండా చేయాలనే రంగాని చంపించారని బాంబు పేల్చారు.

ఓ యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఎన్టీఆర్ మీద ఎవరూ ఊహించని స్థాయిలో విమర్శలు చేశారు. దానికి సంబండించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చెల్ చేస్తోంది. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎన్టీఆర్ శవపూజలు చేశాడని అప్పట్లో ఎన్ కౌంటర్ పత్రికలో వచ్చిన విషయాన్ని నరేంద్ర  ప్రస్తావించారు. ఆ పత్రిక నడిపిన పింగళి దశరధ రామ్ హత్య గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

రంగాపై గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన నరేంద్ర ఆయన గురించి విజయవాడ ప్రజలకు తెలుసన్నారు. పలు హత్య కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్న  విషయాన్ని గర్తుచేశారు.   టీడీపీలోకి  రంగా భార్య రత్నకుమారి చేరినప్పటి నుంచి ఆమెతో సంబంధాలు తెంచుకున్నట్లు స్పష్టం చేశారు.