‘మహానటి’పై మెగా ప్రిన్స్ ప్రశంసలు..

varuntej

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్రను తెరపై బయోపిక్‌గా చూపించిన ప్రయత్నం విజయం సాధించింది. సావిత్రి జీవిత‌ క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం `మ‌హాన‌టి’. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

varuntej

ఇమెతో పాటు ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, సీనియర్ నటుడు మోహన్ బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు వారి వారి పాత్రలో నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ చిత్రంపై సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలందుతున్నాయి. ఇక ఈ సినిమాపై తాజాగా మెగా ప్రిన్స్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

‘మహానటి’ నిజమైన క్లాసిక్ సినిమా అని, ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా తెరెకెక్కించాడని తెలిపారు. ఈ మూవీ చూసిన తర్వాత సావిత్రిపై గౌరవం మరింత పెరిగింది. ఇక సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ తన నటనతో సావిత్రిని గుర్తుకు చేశారని, ఈ బయోపిక్‌ను ఇంత అద్భుతంగా రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు హ్యాట్సాఫ్‌` అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు వరుణ్.