ప్రొఫెసర్‌గా వెంకీ..!

Venkatesh to play Stylish Professor in Teja’s movie..

చాలాకాలం గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు తేజ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా హిట్ తర్వాత బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్‌,విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు.  సురేశ్ ప్రొడక్షన్స్ ,ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో వెంకటేశ్ పాత్ర ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా   సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో వెంకటేశ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడట. డిఫరెంట్ లుక్ తో .. మేనరిజమ్స్ తో ఆయన ఈ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్రను ఎంతో విభిన్నంగా తేజ డిజైన్ చేశాడని టీ టౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.  వెంకటేశ్ పుట్టినరోజైన డిసెంబర్ 13న ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. తొలుత ఈ నగరానికి ఏమైంది ? అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలురాగా తాజాగా మరోటైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆటా నాదే వేటా  నాదే అని టైటిల్‌ని ఫిక్స్‌చేసినట్లు సమాచారం.  వెంకీ సరసన అనుష్క హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.