అజ్ఞాతవాసిలో ప‌వ‌న్, వెంకి సీన్లు..

Victory Venkatesh Cameo Making

‘అజ్ఞాతవాసి’ ఈ మూవీ పవన్‌ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొంది సంక్రాంతికి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఖుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. విక్టరీ హీరో వెంకటేష్ కూడా ఈ చిత్రంలో కొద్ది సేపు కనిపిస్తాడనే ప్రచారం కొద్ది రోజుల నుండి జరుగుతూ వచ్చింది.

ఓ కామెడీ సీన్ లో పవన్ కి మేనమామగా కనిపించనున్నాడని కొందరు చెప్తే, యాక్షన్ సీన్ లో 4 నిమిషాల పాటు వీరంగం సృష్టిస్తాడని మరి కొందరు అన్నారు. మరికొందరైతే సినిమా విడుదలయ్యాక ఇవన్నీ రూమర్స్ అని ఖండించారు. అయితే తాజాగా ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది‌.

అజ్ఞాతవాసి చిత్రంలో వెంకటేష్ ఓ కామియో పాత్ర పోషించాడని, ఆయనకి సంబంధించిన సన్నివేశాలు సంక్రాంతి నుండి అందుబాటులో ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. విక్ట‌రీ వెంక‌టేశ్ ప‌క్క‌న ప‌వ‌న్ కల్యాణ్ కూర్చొని హుషారుగా డైలాగులు చెప్పారు.. విర‌గ‌బ‌డి నవ్వారు. ‘గురు గారూ.. గురూ గారు’ అని ప‌వ‌న్ అన‌గా, ‘గారు అక్క‌ర్లేద‌మ్మా.. గురు చాలు..’ అని వెంక‌టేశ్ డైలాగ్ కొడ‌తాడు. ‘నాక్కొంచం తిక్కుంది’ అని ప‌వ‌న్ అన‌గా, ‘దానికో లెక్కుంది’ అని, ‘అదీ.. అదీ డైలాగు’ అని వెంక‌టేశ్ అన్నారు. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది.