కాజల్‌ తీసుకున్న సెల్ఫీ వీడియో..!

Video Songs of Kajal Agarwal

కాజల్ అగర్వాల్ ‘లైక్ యాప్’ ద్వారా తీసిన సెల్ఫీ మ్యాజిక్ వీడియోను పోస్టు చేసి తన అభిమానులను అలరిస్తోంది. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తూ శ‌రీరం నుంచి కాంతులు వెద‌జ‌ల్లుతూ కాజ‌ల్ క‌న‌ప‌డుతోంది. తాను ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నాన‌ని, మ్యాజిక్ సెల్ఫీ వీడియోలు చిత్రీక‌రించుకుంటున్నాన‌ని ఆమె ఆ యాప్‌కి ప‌బ్లిసిటీ ఇస్తోంది. త‌న‌తో పాటు సెల్పీ దిగాల‌నుకుంటే ఈ ట్వీట్ ను షేర్ చేసి #likekajalaggarwal ను ట్యాగ్ చేయ‌మ‌ని ఈ అమ్మ‌డు కోరుతోంది. ఆమె ట్వీట్ కి విశేషంగా స్పంద‌న వ‌స్తోంది. కాజ‌ల్ చేస్తోన్న ఈ మ్యాజిక్ డ్యాన్స్ ప‌ట్ల ఎంతో ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్నారు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్, అజిత్, వంటి ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తున్న ఏకైక హీరోయిన్ కాజల్ అగర్వాల్‌నే. అదే విధంగా తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాలను అందుకుంటున్న నటి కాజల్. తెలుగులో రానాతో రొమాన్స్ చేసిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం విడుదలైంది. ఇక హిందీలో సన్నిడియోల్‌తో నటించే లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించిందనే ప్రచారం జరుగుతోంది.