విలేకరికి వార్నింగ్‌ ఇచ్చిన విద్యాబాలన్‌..

Vidya Balan gives fitting response to Journalist question

భారతీయ సినిమాలకు సంబంధించి హీరోయిన్ లు సన్నగా.. నాజూగ్గా.. కళ్లు కలువ పువ్వుల్లా..నడుము నెలవంకలా… ఇలా చెప్పుకుంటే పోతే కథానాయికకు ఇంకా చాలా క్వాలిటీలు ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే జీరో సైజ్ లో ఉండాలి. లావయితే కథానాయిక పాత్రలకు పనికి రారు. ఇది మన సినిమాలకు సంబంధించి హీరోయిన్లకు కామన్ ఐడెంటిటీ. ఈ మైండ్ సెట్ కు మీడియా కూడా అలవాటైపోయింది. అయితే తాజాగా అదే ఆలోచనతో ఫిజిక్ గురించి ఓ ప్రశ్న అడిగినందుకు ఓ మీడియా పర్సన్ కు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ చెంప చెల్లుమనిపించేలా సమాధానమిచ్చింది.

Vidya Balan gives fitting response to Journalist question

విద్యబాలన్ హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం ‘తుమ్హారీ సులు’ కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియా ముందుకొచ్చింది. ఈ టైంలో ఓ మీడియా వ్యక్తి బరువు తగ్గి గ్లామర్ పాత్రలు ఎప్పటి నుంచి చేస్తారంటూ ప్రశ్న వేశాడు. దీంతో విద్యకు కోపంతో ఊగిపోయింది. ‘‘ఇలాంటి క్వశ్చన్ అడగడానికి బదులు లేడీస్ విషయంలో మీ మైండ్ సెట్ మార్చుకుంటే బెటర్ అని అతడికి క్లాస్‌ పీకిందట. ఇప్పుడు చేస్తున్న రోల్స్ తో నేను చాలా హ్యాపీగా ఉన్నా. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కు… బరువు తగ్గడానికి ఏమన్నా సంబంధం ఉందా’’ అంటూ మాటలతో ఎదుటివ్యక్తిని గుక్క తిప్పునీకుండా చేసింది.

Vidya Balan gives fitting response to Journalist question

తుమ్హారీ సులు సినిమాలో విద్యాబాలన్ రేడియో జాకీ పాత్ర చేస్తోంది. సులోచన అనే ఓ సాధారణ గృహిణి అనుకోని పరిస్థితుల్లో రేడియో జాకీగా మారి పేరు తెచ్చుకుంటుంది. దాంతో ఆమె జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సురేశ్ త్రివేణి ఈ మూవీకి డైరెక్టర్. రేడియో జాకీ అంటే గుక్క తిప్పుకోకుండా మాట్లాడాలి. ఆ పాత్ర విద్యాబాలన్ కు బాగానే వంటపట్టినట్టుంది. అందుకే ఇబ్బందికరమైన ప్రశ్న అడిగిన వాళ్లను గుక్క తిప్పుకోనీకుండా చేసింది.