బిచ్చగాడు…తాగుబోతయ్యాడు…!

Vijay Antony Indrasena updates

బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  నటుడు విజయ్ ఆంటోని.  త్వరలో ‘ఇంద్రసేన’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో ‘అన్నాదురై’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రాన్ని తెలుగులో ‘ఇంద్రసేన’గా రిలీజ్ చేయనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన  సంగతి తెలిసిందే.  సి. శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాత  రాధిక శరత్ కుమార్.

ఈ సినిమాలో విజయ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ షాప్ కి ఓనరైన తాగుబోతు పాత్రలో అన్నయ్యగా .. బాధ్యత తెలిసిన పీఈటీ మాస్టర్ గా తమ్ముడి పాత్రలో ఆయన కనిపిస్తాడని చెబుతున్నారు. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుందనీ .. సెకండాఫ్ కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. నవంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో విజయ్‌ ఎడిటింగ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత హీరో, నిర్మాతగా తన సత్తా నిరూపించుకున్న విజయ్ ఆంటోనీ, ఇపుడు ఎడిటింగ్ లాంటివి చేస్తూ తాను ఆల్ రౌండర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.