ఈ సారి మరింత బోల్డ్‌గా విజయ్‌ దేవరకొండ..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. సినిమా పోస్టర్ అంటే చాలామంది ఫిలిం మేకర్స్ చాలా క్యాజువల్ గా తీసుకుంటారు కానీ ప్రేక్షకుడిని సినిమా హాలుదాకా తీసుకురావడంలో పోస్టర్ చాలా కీలకం. ఒక్క పోస్టర్ చాలు.. ప్రేక్షకుడి దృష్టి ఆకట్టుకోవడడానికి సినిమా హిట్ కొట్టడానికి. లేటెస్ట్ గా వచ్చిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

Vijay Devarakonda Upcoming movie

హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ షాలినీ పాండే లిప్ టు లిప్ కిస్ తో ఉన్న పోస్టర్ ఒక్కటే సినిమాకు ముందు రిలీజ్ చేశారు. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది అసభ్యంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు రగడ చేసినా అది చివరకు సినిమాకు ప్లస్సే అయ్యింది. అర్జున్ రెడ్డి పోస్టరే ఓ రకంగా సంచలనం అనుకుంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తర్వాత సినిమా పోస్టర్ కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టించేలా ఉంది. హీరోయిన్ తొడలపై తన తల వాల్చి ఆమె కాళ్లను ఒళ్లో పెట్టుకుని కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ పోస్టర్ ఎంత ఎరోటిక్ గా ఉందో అంత అట్రాక్టివ్ గానూ ఉంది. ఈ సినిమాకు ఫిలిం మేకర్స్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

Vijay Devarakonda Upcoming movie

వివాదాలతో మొదలైన అర్జున్ రెడ్డి సినిమా కంటెంట్ – ఇంటెన్సిటీకి బాగా కనెక్టయింది. యూత్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా అర్బన్ సెంటర్స్ లో అర్జున్ రెడ్డి హవా ఇప్పటికీ జోరుగానే సాగుతోంది. అందుకే తర్వాత సినిమాలోనూ అర్బన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.