రియల్ హీరో..

Vijay Sethupathi donates 49.7 lakhs for education!

పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. కోట్ల రూపాయల ఆస్తి లేదు. కానీ తమిళ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నాడు  తమిళ హీరో విజయ్ సేతుపతి. తాను తీసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అనిల్‌ సేమియా కంపెనీ యాడ్‌లో నటించి 50లక్షల రూపాయల చెక్కుని పారితోషికంగా అందుకున్నాడు. ఆ చెక్కును కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌కి అందచేసి విద్యలో వెనుకబడిన జిల్లాలో నీట్‌కు బలైన అనిత పేరున అంగన్‌ వాడీ కేంద్రాలకు, పేద వికలాంగ విద్యార్ధులకు వినియోగించాలని  కోరారు.

vijay sethupathi
తన సంపాదనలో కొంతభాగాన్ని విద్యార్ధులకు, వికలాంగులకు, రైతులకు అవసరమయ్యే నిత్యవసరాల్ని అందిస్తానని ప్రకటించాడు విజయ్. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన నటుడినని.. తాను పేదల కష్టాలను అర్ధం చేసుకోగలనని  తెలిపారు.

ఇదంతా  పబ్లిసిటీ కోసం చేసుకోవటం లేదని.. ఇది చూసి కొందరైనా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తారనే ఆకాంక్షను వ్యక్తంచేశారు. తాను కష్టపడి సంపాదించే డబ్బును దాన ధర్మాలకు వినియోగిస్తూనే.. ఇలా పెద్దమొత్తంలో డబ్బును పేదలకు అందచేస్తున్న విజయ్‌ సేతుపతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.