You are here

లేడీ గెటప్‌లో హీరో విజయ్‌…

కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఈ మధ్యకాలంలోనే విజయ్ సేతుపతి చేరిపోయాడు. అందుకు కారణం ఆయన ఎంచుకుంటూ వచ్చిన వైవిధ్యభరితమైన పాత్రలే. అదే పద్ధతిని ఆయన తాజా చిత్రం విషయంలోను అనుసరిస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన ‘సూపర్ డీలక్స్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ సేతుపతి సుదీర్ఘంగా ఉండే పాత్రలో లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా వచ్చేయగా.. ఈ పాత్ర పేరు శిల్ప అనే సంగతి రివీల్ చేశారు. రెడ్ కలర్ శారీలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా.. అచ్చు అమ్మాయి మాదిరిగానే కనిపిస్తున్నాడు విజయ్ సేతుపతి.

Vijay Sethupathi In Lady Getup

ఎక్కువ మేకప్ లేకుండానే లేడీ గెటప్‌లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ భలే ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంలి పాత్రలో ఇంతకుముందు టాలీవుడ్‌లో చిత్రం భళారే విచిత్రంలో నరేష్.. మేడమ్ మూవీలో రాజేంద్ర ప్రసాద్.. ఇలాంటి ప్రయోగాలు చేశారు. రీసెంట్ గా తమిళంలో ‘రెమో’ అంటూ శివ కార్తికేయన్ కూడా అదరగొట్టేశాడు. ఇప్పుడు మాస్ హీరో అనిపించుకుంటున్న విజయ్ సేతుపతి కూడా ఇలాంటి ఒక పాత్ర చేస్తున్నాడు.

Vijay Sethupathi In Lady Getup

ఇఫ్పుడీ సినిమా పేరు సూపర్ డీలక్స్ అని అనౌన్స్ చేశారు కానీ.. కొన్ని నెలల ముందు నుంచే ఈ సినిమా అప్ డేట్స్ జనాలకు తెలుసు. అనీతి కథైగళ్ అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కగా.. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫదా ఫాజిల్.. గాయత్రి కీలక పాత్ర పోషిస్తున్నారు. లేడీ గెటప్ లో ఇప్పటివరకూ చాలామంది హీరోలే ఆకట్టుకున్నారు కానీ.. ఒక ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ హీరో ఇలాంటి ప్రయత్నం చేయడం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు ఈ విజయ్ సేతుపతి.. మెగాస్టార్ 151 మూవీ సైరాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Related Articles