మళ్ళీ అక్కినేని హీరోతోనే…

Vikram Kumar, Naga Chaitanya to team up in 2019

ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు విక్రమ్ కుమార్‌.  ‘ఇష్క్‌’, ‘మ‌నం’, ’24’ చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. అక్కినేని మూడు త‌రాల హీరోల్ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చిన మ‌నం సినిమా అయితే ఒక క్లాసిక్ గా నిలిచి పోయింది. ప్రస్తుతం అఖిల్ తో ‘హలో’ సినిమా చేస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా విడుదలకు సిద్దమైయింది.ఈ చిత్రం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని నేచుర‌ల్ స్టార్ నానితో చేసేందుకు విక్ర‌మ్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Vikram Kumar, Naga Chaitanya to team up in 2019
కానీ మరోసారి అక్కినేని హీరోతోనే సినిమా చేయనున్నాడు విక్రమ్. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించాడు. వచ్చే ఏడాది మొదలవుతుందని తెలిపారు.  ప్రస్తుతం చైతు  ‘సవ్యసాచి’, ‘శైలజ రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటే విక్రమ్ సినిమా కూడా చేస్తాడని తెలిపారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో చైతూకు అత్తగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ పేరు వినిపిస్తోంది.నాగార్జునతో కలిసి చాలా సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ…సోగ్గాడే చిన్నినాయనలో తననటనతో ఆకట్టుంది. ఇప్పుడు చైతూకు అత్తగా కనిపించబోతోంది.