చియాన్‌ విక్రమ్‌తో సమంత..10

vikram..samantha 10 release date

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, అక్కినేని సమంత జంటగా నటించగా తమిళంలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకొన్న చిత్రం “10 ఎండ్రాతుకుల్ల”. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని “10” పేరుతో తెలుగులో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. “విక్రమ్ క్యారెక్టరైజేషన్, సమంత ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణలుగా విడుదలవుతున్న మా “10” చిత్రం మాస్ ఆడియన్స్ తోపాటు క్లాస్ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది. డిసెంబర్ 15న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం” అన్నారు.

vikram..samantha 10 release date