కీవిస్ రగ్బి జట్టు…విరాట్ సేన ఒక్కటే

Virat Kohli A Role Model

సొంత గడ్డపై శ్రీలంకను భారత్‌ దెబ్బ మీద దెబ్బ కొట్టింది. టెస్టు క్రికెట్  చరిత్రలో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు కోహ్లి.  అతిరథ మహారథులెందరికో సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాధించి చూపించింది. దశాబ్దాలుగా అందకుండా ఊరిస్తున్న విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ను అదిరిపోయే రీతిలో  దక్కించుకుంది. అంతేగాదు ఐదు వన్డేల సిరీస్‌లోనూ వైట్‌వాష్‌ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. స్వదేశంలో ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కసారి కూడా క్లీన్‌స్వీప్‌ ఓటమిని ఎదుర్కోని శ్రీలంకకు కోహ్లి సేన తొలిసారి వైట్‌వాష్‌లతో దడపుట్టించింది.

Virat Kohli A Role Model
ఈ నేపథ్యంలో కోహ్లిపై శ్రీలంక కోచ్‌ నిక్‌ పోటాస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టులో అతడు నిర్దేశించిన ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీసేనను పోటాస్‌ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన న్యూజిలాండ్‌ రగ్బీ జట్టుతో పోల్చాడు.

మీరోసారి కివీస్‌ రగ్బీ జట్టును చూడండి. వారంతా నల్లరంగు జెర్సీల్లో ఒకేలా కనిపిస్తారు. ప్రత్యర్థి జట్టు నుంచి వారికి ఎంతో గౌరవం లభిస్తుంది. బరిలోకి దిగితే నిర్దాక్షిణ్యంగా పోరాడతారు. శత్రువును దెబ్బతీస్తారు. వారి ఆట నైతిక విలువలు చాలా గొప్పవి. అన్ని జట్లు వారిలాగే ఉండాలని తపిస్తాయని…టీమిండియా కూడా అలాగే కనిపిస్తోందన్నారు.  కోహ్లి అందరికీ   ఆదర్శమని.. తనతో పాటు మిగతా వారినీ పైకి తీసుకొస్తాడని కొనియాడాడు.