నెం. 1 ఆల్ రౌండ‌ర్‌.. జ‌డేజా

Virat Kohli's Special Message For 'Sword Master'
Virat Kohli's Special Message For 'Sword Master'

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండ‌ర్‌గా మొద‌టి ర్యాంకును రవీంద్ర జ‌డేజా చేజిక్కించుకున్నాడు. జ‌డేజా నెం.1 స్థానాన్ని చేరుకోవ‌డం త‌న కెరీర్‌లో ఇదే మొద‌టిసారి. 438 పాయింట్ల‌తో జ‌డేజా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 431 పాయింట్ల‌తో షాకిజ్ రెండో స్థానంలో, 418 పాయింట్ల‌తో మ‌రో భార‌త ఆట‌గాడు అశ్విన్ మూడో స్థానంలో నిలిచారు. ఇటీవ‌ల జ‌రిగిన కొలంబో టెస్ట్‌, గాలే టెస్టులు ర‌వీంద్ర జ‌డేజా మెరుగైన ర్యాంకును చేరుకునేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి.

జడేజాకు సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ తన ట్విటర్‌ ద్వారా జడేజాకి అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన కత్తి మాస్టర్‌, మిస్టర్‌ జడేజాకి అభినందనలు. వెల్‌డన్‌ జడ్డూ. మూడో స్థానంలో నిలిచిన అశ్విన్‌కి అభినందనలు కోహ్లీ పేర్కొన్నాడు.

కాగా, జడేజాపై ఐసీసీ ఒక టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తిలకరత్నేపై ప్రమాదకరంగా బంతిని విసిరిన నేపథ్యంలో, జడ్డూపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జడేజా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించాడు. “నేను మంచిగా మారాలనుకున్నప్పుడు… ప్రపంచం మొత్తం నన్ను సంచలనానికి కేంద్రబిందువుగా మార్చింది” అని ట్వీట్ చేశాడు.