సెహ్వాగ్‌ ఓ పిచ్చోడన్న గంగూలీ

Virender Sehwag Spoke Foolishly,' Says Sourav Ganguly
Virender Sehwag Spoke Foolishly,' Says Sourav Ganguly

‘నేను కోచ్‌ ఎందుకు కాలేకపోయానో తెలుసా..ఎందుకంటే బీసీసీఐలోని పెద్దలతో నాకు సాన్నిహిత్యం లేకపోవడమే’ అని సెహ్వాగ్ అన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ కోరిక మేర‌కు చివ‌రి నిమిషంలో వీరూ కోచ్ ప‌ద‌వి కోసం అప్లై చేసుకున్న విష‌యం తెలిసిందే . దీనిపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ సౌరబ్ గంగూళీ స్పందించాడు. దీనిపై తాను మాట్లాడేది ఏమీ లేదని, సెహ్వాగ్ ఓ పిచ్చోడిలా మాట్లాడాడు అని దాదా ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. అయితే సెహ్వాగ్ విష‌యంలో తాను అలా స్పందించ‌లేద‌ని త‌ర్వాత దాదా ఓ ట్వీట్ చేయ‌డం విశేషం. సెహ్వాగ్‌ను తాను ఎప్పుడూ అలా అన‌లేదని,  అత‌ను నాకు చాలా స‌న్నిహితుడని,  త్వ‌ర‌లోనే అత‌నితో మాట్లాడ‌తా అని గంగూలీ ఆ ట్వీట్‌లో చెప్పాడు.

sehwag

స‌చిన్‌, గంగూలీ, ల‌క్ష్మ‌ణ్‌ల‌తో కూడిన ముగ్గురు స‌భ్యుల క‌మిటీ మాత్రం ర‌విశాస్త్రిని కోచ్‌ను చేసింది. టీమిండియా కోచ్‌ పదవికి మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పోటీపడ్డ సంగతి తెలిసిందే. తనను కాదని రవిశాస్త్రికి ఇవ్వడంపై సెహ్వాగ్‌ స్పందించాడు. వాస్తవంగా తాను కోచ్‌ పదవికి దరఖాస్తు చేయాలనుకోలేదన్నాడు. ‘బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, జీఎం ఎంవీ శ్రీధర్‌ నావద్దకు వచ్చి కోచ్‌ పదవికి దరఖాస్తు పంపాలని కోరారు. వారి ప్రతిపాదనపై ఆలోచించాకే అందుకు దరఖాస్తు చేశాను’ అని వివరించాడు. ఇక కోచ్‌ పదవికి ఎందుకు దరఖాస్తు చేయడం లేదని చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా రవిశాస్ర్తిని అడిగానన్నాడు. గత తప్పును తాను పునరావృతం చేయనని శాస్ర్తి బదులిచ్చాడని సెహ్వాగ్‌ వెల్లడించాడు. తనకెందుకు కోచ్‌ పదవి రాలేదన్న ప్రశ్నకు దరఖాస్తు చేయ డానికి ముందు కెప్టెన్‌ కోహ్లీనీ సంప్రదించానని, అతడు ఓకే అన్నాకే ముందుకు సాగానని తెలిపాడు.