రాజకీయాల్లోకి విశాల్..!

Vishal enters politics..!

సినిమాలు రాజకీయాల చుట్టూ తిరడగం, రాజకీయాలు సినిమా వాళ్ల చుట్టూ తిరగడం పరిపాటే. అయితే ఈ పరిస్థితి తమిళ చిత్రపరిశ్రమలో కాస్త ఎక్కువ. ఎంజీఆర్ మొదలు జయలలిత, విజయ్‌ కాంత్ వరకు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే. తాజాగా తలైవా రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతుండగా విలక్షణ నటుడు కమల్ మాత్రం రాజకీయాల్లోకి వస్తానని….కాషాయాన్ని మాత్రం ధరించనని తేల్చిచెప్పాడు.

ఇప్పుడు హీరో విశాల్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి సంచలనం రేపాడు. ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ గా మరియు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాల్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలపాడు.  కానీ ఎప్పుడూ రంగప్రవేశం అనే విషయాన్ని మాత్రం ఫైనల్ చేయలేదు.

తెలుగువాడిగా తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విశాల్ తక్కువ సమయంలోనే తమిళుల మనసు గెలుచుకున్నాడు. తమిళనాడులో  ఏ చిన్న కష్టం వచ్చినా సినీపరిశ్రమ నుంచి మొదటగా సాయం చేసే వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది.

అంతేగాదు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న తమిళ  రైతులకు మద్దతు ప్రకటించడమే కాకుండా వారి కోసం ప్రతి సినిమా టిక్కెట్‌లో ఒకరూపాయి అందేలా చేశారు . తరచూ తన అభిమానుల సంఘం తరఫున నిరుపేదలకు విద్యాపరమైన సహాయం కూడా చేస్తున్నాడు. అధికారంలో ఉంటే ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయవచ్చని చెబుతున్నాడు విశాల్.