You are here

ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

తెలంగాణలో కాసేపటి క్రితం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 119 మంది ఎమ్మల్యేలకు గాను 117 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ కు చెందిన మనోహర్ రెడ్డి, ఐంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఒవైసీలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అనారోగ్య కారణాలతో వీరిద్దరూ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటు వేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఓటు వేయగా, స్పీకర్ మధుసుదనాచారి రెండవ ఓటు వేశారు.. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్ నుంచి శాసనసభ్యులు, మంత్రులు మూడు బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు టీఆర్‌ఎస్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా వేసే పార్టీ ఎమ్మెల్యేల ఓట్లలో ఒక్కటి కూడా వృథా కాకుండా చూసేందుకు, వారికి అవగాహన కల్పించడానికి ఆదివారం తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ ఏర్పాటు చేశారు.

 telanganaassembly

ఈ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పత్రాలపై ఓట్లు వేస్తారు. శాసనసభ్యుల కోసం గులాబీ రంగులో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. ఎంపీల ఓట్లకు స్థిర విలువ ఉన్నా- శాసనసభ్యుల ఓట్లకు మాత్రం వారి రాష్ట్రాలను బట్టి విలువ మారిపోతుంది కాబట్టి వేర్వేరు రంగుల బ్యాలెట్లను సిద్ధం చేశారు. కేవలం ఈసీ సరఫరా చేసే ప్రత్యేక కలాలతో నమోదు చేస్తేనే ఓట్లు చెల్లుతాయి.  నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

mpsparlament3

Related Articles