దసరాకి సాయి ధరమ్‌ సందడి..

VV Vinayak and Sai Dharam Tej combo from Dasara

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతంలో విడుదలైన జవాన్‌ ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్‌,ఫస్ట్‌ లుక్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న వచ్చింది.

అయితే విజయదశమికి థియేటర్లకు రావడానికి కొన్ని సినిమాలు సన్నాహాలు చేసుకుంటూ ఉంటే, మరికొన్ని సినిమాలు ఫస్టులుక్ లు టీజర్లు వదలడానికి రెడీ అవుతున్నాయి. ఈ పండుగ రోజుల్లో సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంతమంది దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ జాబితాలో సాయిధరమ్ తేజ్ సినిమా కూడా ఉండటం విశేషం.

VV Vinayak and Sai Dharam Tej combo from Dasara

రీసెంట్ గా ‘జవాన్’ సినిమాను పూర్తిచేసిన సాయిధరమ్ తేజ్, వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆగస్టులో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ‘దుర్గ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో, కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించనుంది.