ఈ సారి ఆయన కోసమే…

Suresh Raina

రెండేళ్ల విరామం తర్వాత ఈ సారి ఐపీఎల్‌ సీజన్‌లోకి అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూకుడును కొనసాగిస్తోంది. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ తన అద్భుతమైన ఆట తీరుతో ధోనీ సారధ్యంలో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై-హైదరాబాద్ క్వాలిఫయర్-1లో అనుహ్య విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు వెళ్లింది చెన్నై.

Suresh Raina

దీంతో మరోసారి టైటిల్ గెలవాలనే దూకుడుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ధోనీపై వచ్చే విమర్శలకు తన ఆట తీరుతో విమర్శకుల నోళ్లకు తాళం వేస్తూ వస్తున్నాడని ఈ సారి ఏకంగా ధోనీ కోసమే టైటిల్‌ గెలవబోతున్నామని తాజాగా సురేష్ రైనా తెలిపారు.ఈ సీజన్‌లో కూడా ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్‌లో గెలుపును ముద్దాడబోతోందని చెన్నై అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆట తీరుతో తన అద్భుతాన్నిప్రదర్శిస్తే మరోసారి చెన్నై టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.