పెళ్లి చేసుకోమంటే..అది ఇచ్చాడు..!

Wyatt To Unleash Virat Kohli's Gift In India

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లిని ఇష్టపడని వారుండరు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కోహ్లి ఇటీవలె బాలీవుడ్ నటి అనుష్కను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనుష్క కంటే ముందుకు కోహ్లీకి ఎంతోమంది ప్రపోజ్ చేసిన తిరస్కరిస్తు వచ్చాడు. వారిలో ఇంగ్లాండ్ క్రికెటర్ డాని వ్యాట్ కూడా ఒకరు.

ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో మెరుపు సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమెన్ క్రికెటర్ డాని వ్యాట్. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆ రోజు తాను సెంచరీ చేయడానికి కారణం కోహ్లి ఇచ్చిన బ్యాటేనని చెప్పుకొచ్చింది. తాను ఓ రోజు ట్విట్టర్‌ ద్వారా కోహ్లికి ప్రపోజ్ చేశానని తెలిపింది.దానికి కోహ్లి నుంచి వచ్చిన స్పందన కంటే నెటిజన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపింది.

Wyatt To Unleash Virat Kohli's Gift In India

కొద్దిరోజుల తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన కోహ్లిని కలిసి తన ప్రేమ విషయం తెలపగా ట్విట్టర్‌లో అలాంటి సందేశాలు పెట్టొద్దని హెచ్చరించాడని తెలిపింది. ఆ తర్వాత తాను సారీ చెప్పాని..సారీ చెప్పగానే బ్యాట్‌ బహుమతిగా ఇచ్చాడని కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆసీస్‌పై సెంచరీ చేశానని చెప్పుకొచ్చింది.