అభిమానుల‌కు చైతూ రాఖీ గిఫ్ట్…

Yuddham Sharanam Songs

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `యుద్ధం శ‌ర‌ణం`. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుండగా చైతూ సరసన లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా రాఖీ కానుకగా అభిమానుల కోసం చిత్రంలోని పాటను విడుదల చేశాడు చైతూ.

`ఎన్నో ఎన్నో భావాలే` అనే పాట లిరిక‌ల్ వీడియోను నాగచైత‌న్య ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. సినిమాలో నాగ‌చైత‌న్య‌కు రాఖీ క‌డుతున్న స‌న్నివేశంతోనే ఈ వీడియో మొద‌ల‌వుతోంది. కుటుంబ బంధాల‌ను, వారితో గడిపిన సంతోష క్ష‌ణాల‌ను ఈ వీడియోలో చూపించారు. నాగ‌చైత‌న్య త‌ల్లిదండ్రులుగా రావుర‌మేశ్‌, రేవ‌తిలు న‌టించారు. అలాగే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠికి, నాగ‌చైత‌న్య‌కు మ‌ధ్య ఉన్న కొన్ని చ‌క్క‌ని స‌న్నివేశాల‌ను కూడా ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ – అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.